Tuesday, 28 July 2026 11:01:38 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025 ముగింపు వేడుకలు

Date : 08 February 2025 08:38 PM Views : 720

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మూడు రోజుల పాటు జరిగిన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025 ముగింపు వేడుకలు జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.జిల్లా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ గారు 100 మీటర్స్ పరుగు పందెం ఫైనల్ మరియు టగ్ ఆఫ్ వార్ ఫైనల్ మ్యాచ్ లను తిలకించారు.అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొని తమ ఆసక్తిని చూపినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.ఉత్కంఠ భరితంగా సాగిన కొన్ని క్రీడా పోటీలను చూసి సిబ్బంది లోని పోరాట పటిమను గమనించానని తెలిపారు.వయసుతో కూడా సంబంధం లేకుండా కొంతమంది అధికారులు,సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొనడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు.ఈ స్పోర్ట్స్ మీట్లో విభాగాల వారీగా జరిగిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలియజేసి వారికి మెడల్స్ ను అందజేశారు.పోటీ ప్రపంచంలో గెలుపోటములు సహజమని,క్రీడలలోనే కాదు జీవితంలో కూడా ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.స్పోర్ట్స్ మీట్ ను అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులు,సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం సబ్ డివిజన్ల వారీగా క్రీడాకారులు స్పోర్ట్స్ మీట్ ముగింపు పేరెడ్ తో ఎస్పీ గారికి గౌరవ వందనాన్ని సమర్పించారు.భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ గారి విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ యాన్యూవల్ స్పోర్ట్స్ మీట్ 2025 ను ముగిస్తున్నట్లుగా ప్రకటించారు.అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని పోలీసు అధికారులు,సిబ్బంది తమ అనందత్సవాలను వ్యక్తపరిచారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :