Tuesday, 28 July 2026 12:04:21 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణపై టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. మే 18న బూర్గంపాడులో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ.

Date : 15 May 2026 08:47 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందన, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితికేష్ ఠాగూర్, జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్‌తో పాటు డీఎఫ్‌ఓ, పోలీస్, రెవెన్యూ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సాగునీటి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర లైన్ డిపార్ట్‌మెంట్‌ల అధికారులు ఐడీఓసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్‌డిఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ మాట్లాడుతూ జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించబడిన నేపథ్యంలో వరదలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు.జిల్లాలో అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాదాలు సంభవించిన సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలి, అగ్నిమాపక చర్యలను ఎలా చేపట్టాలనే అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.ఈ నెల 18న బూర్గంపాడు మండలంలో నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్‌ను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఎన్‌డిఎంఏ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :