తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంవత్సర కాలం పాటు శిక్షణ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సొరబ్ శర్మ శిక్షణ పూర్తిచేసుకుని వెళ్తున్న సందర్భంగా గురువారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , శిక్షణ కాలంలో సొరబ్ శర్మ పరిపాలనా పనితీరులో చూపిన నిబద్ధత, కృషి ప్రశంసనీయమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం కనబరిచారని తెలిపారు . తాను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా శిక్షణలో ఉన్న సమయంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, తన వద్ద పనిచేసిన అటెండర్ నుండి మర్యాద, గౌరవం వంటి విలువలను నేర్చుకున్నానని తెలిపారు. దివ్యాంగుల విద్యార్థుల కోసం పాఠశాల నిర్మాణానికి సొరబ్ శర్మ రూపొందించిన ప్రత్యేక డిజైన్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని , ఆయన సృజనాత్మకతను అభినందించారు.ఐటిడిఏ పీవో రాహుల్ మాట్లాడుతూ , వైవిధ్యమైన జిల్లాలో శిక్షణ పొందిన సొరబ్ శర్మ ఎంతో అనుభవం సంతరించుకున్నారని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని ఢిల్లీ నీతి ఆయోగ్‌లో ఆరు నెలల శిక్షణ కోసం వెళ్తున్నారని చెప్పారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పరీక్షలు నిర్వహించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. అలాగే, సికిల్ సెల్ అనీమియా పై ప్రత్యేక ప్రాజెక్ట్ రూపొందించి సమర్పించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ , జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్, పూర్వ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకత్వం, అన్ని శాఖల అధికారుల సహకారంతోనే విజయవంతంగా శిక్షణ పూర్తి చేయగలిగానని తెలిపారు. ఈ జిల్లాలో శిక్షణ కాలంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు .సౌరబ్ శర్మ ఒక కష్టపడి పనిచేసే అధికారి అని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వినయంతో వ్యవహరిస్తారని అధికారులు కొనియాడారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం అధికారులు శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవో మధు, సిపిఓ సంజీవరావు, ఏవో అనంత రామకృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ