తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 1 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెల్లవారేసరికి వాగులు అన్ని పొంగి పోరిలాయి. అప్రమత్తమైన మండల అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూశారు . అన్నారుపాడు నుండి గుండ్లరేవు మధ్యగల వాగు ఉధృతి తగ్గేవరకు ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, ఎంపీ ఓ తులసిరామ్ చెప్ట్టా లపై నీళ్ల ఉధృతి తగ్గేవరకు రోడ్లకు అడ్డుగా పంచాయతీ ట్రాక్టర్ ని అడ్డుగాపెట్టారు. అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానరాని ప్రజాప్రతినిధుల గూర్చి ప్రజలు ఒకింత ఆవేదన వ్యక్తపరిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ