తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 11 తెలుగు వెలుగు ) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహాన్ని ఎంపీఓ తులసిరామ్ తనిఖీ చేశారు. వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వంట విధానం మరియు పరిశుభ్రత అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు సమయానికి పౌష్టికాహారం ఇతర మౌలిక సదుపాయాలు నాణ్యమైనవి అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో, తులసి రామ్, పడమటి నరసాపురం సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి , HWO తార , పంచాయతీ కార్యదర్శి హారిక పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ