Tuesday, 28 July 2026 09:26:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మణుగూరులో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం , రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్.

Date : 04 August 2025 06:14 PM Views : 783

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతన ఏర్పాటుచేసిన రక్త నిల్వ కేంద్రం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, రిబ్బన్ కటింగ్ చేసి, బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాట్లను పరిశీలించారు . రక్త నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..“రక్తదానం అంటే ప్రాణదానం, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఇతరరికి జీవం పోసే వరంగా మారుతుంది. గర్భిణీలు, తలసీమియా, సికిల్ సెల్, అనీమియా వంటి వ్యాధులతో బాధపడేవారు, ప్రమాదాల వల్ల గాయపడిన వారు రక్తానికి ముఖ్యంగా ఆధారపడుతారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలిఅని పిలుపునిచ్చారు.రక్తదానం చేయడం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలు, తల సేమియా, సికిల్ సెల్, అనీమియా, వంటి రోగులకు మరియు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం ప్రాణ రక్షణగా మారుతుంది అన్నారు. మణుగూరులో ఈ రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా, అత్యవసర పరిస్థితులలో పేషెంట్లకు రక్తాన్ని సమీపంలోనే అందుబాటులోకి తేవచ్చు. ఇప్పటి వరకు రక్త అవసరాల కోసం ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై అది అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీల్ మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సందర్భంగా 20 మంది రక్తదానం చేశారు. నూతనంగా ప్రారంభించిన రక్తనిల్వ కేంద్రానికి సరిపడా రక్త నిల్వల కోసం ఈ రక్తాన్ని ఉపయోగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :