Tuesday, 28 July 2026 11:59:47 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 February 2026 12:27 PM Views : 229

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాఠశాల ఆవరణలో, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ బండిల్‌పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఎన్నికల సామగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక సదుపాయాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేదా గందరగోళానికి తావులు లేకుండా, చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సామగ్రి అందిందా లేదా జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ హెచ్చరించారు. సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులకు అప్పగించారు. అలాగే, పోలింగ్ సామగ్రి, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లను తరలించే సమయంలో సాయుధ పోలీసు బందోబస్తు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తిన సందర్భంలో వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత ఎన్నికల అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :