తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం లోని భవితా కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ పిల్లలతో, వారి తల్లిదండ్రులతో ఇంటర్ యాక్ట్ అయిన విద్యాశాఖ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లలకు అందవలసిన సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల యొక్క కౌశలాలను అభివృద్ధి పరచుకొని, సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అభ్యసించే విధంగా ఈ భవిత కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.దివ్యాంగ పిల్లలందరికీ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలాస్ , ఉన్నత విద్యాశాఖ కమీషనర్ శ్రీమతి దేవసేన అసిస్టెంట్ కలెక్టర్ (U/T) సౌరబ్ శర్మ, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్స్ రాజీవ్ , మదన్ మోహన్ , RJD సత్యనారాయణ రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి , జిల్లా కోఆర్డినేటర్ లు నాగరాజ శేఖర్, సైదులు, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ