Tuesday, 28 July 2026 11:53:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం చేయాలి: డీఆర్‌డీఓ విద్యా చందన

Date : 17 March 2026 06:14 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో, ములకలపల్లి మండలం పాతగంగారం గ్రామపంచాయతీ పరిధిలోని జగన్నాధపురం గ్రామాన్ని మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైన్‌లు మరియు సోక్‌పిట్‌ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, వాటి పురోగతిని సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ పనులు అత్యంత కీలకమని ఆమె అన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్‌పీఏ కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘాల ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, రుణాల సక్రమ వినియోగం, ఆదాయ వృద్ధి మార్గాలు, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగంపై సభ్యులకు మార్గదర్శకాలు అందించారు. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన వేదికలని, ప్రతి సభ్యురాలు బాధ్యతతో వ్యవహరించి సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్‌డీఓ విద్యా చందన సూచించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :