Tuesday, 28 July 2026 08:12:40 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలి.. రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

Date : 19 April 2025 07:30 PM Views : 638

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి 2024-25 సీజన్ ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డి. ఎస్. చౌహాన్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో యాసంగి వడ్ల కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ, త్రాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా యాసంగి సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కొరకు రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, రాష్ట్రంలో 8 వేల 329 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయాలని, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అధికారులు గోదాములలో ఉన్న సన్న బియ్యం నిల్వలను పరిశీలించాలని, నాణ్యత పరిశీలించాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రాజెక్టుల నుండి తరలించడానికి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అతను కలెక్టర్ విద్యాచందన తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి బియ్యం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నల్లా కనెక్షన్ లేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు , జిల్లా నీటి పారుదల శాఖ ఈ ఈ అర్జున్ రావు , మిషన్ భగీరథ ఈఈ లు తిరుమలేష్, నలిని, పౌరసరఫరాల శాఖ అధికారులు త్రినాథ్ బాబు, రుక్మిణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :