తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు, రేపు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రేపు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ