Tuesday, 28 July 2026 06:17:15 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలోని ఆదివాసీ ప్రజలను అన్ని రంగాల్లో ముందుంచడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం , ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 09 August 2025 05:36 PM Views : 638

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు ఆదివాసీ నాయకులు ప్రజలు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం కొత్తగూడెం క్లబ్లో ఈ ర్యాలీ నందు పాల్గొన్న ఆదివాసీ నాయకులు ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశార. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసి జిల్లాగా పేరొందిన భద్రాద్రి జిల్లాలో నివసించే ఆదివాసి ప్రజలు అన్ని రంగాల్లో ముందుండేలా చూడడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలిపారు. ఇందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల కోసం ప్రభుత్వం తరఫున జిల్లా పోలీస్ శాఖ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసి ప్రజలకు విద్య,వైద్యం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. చర్ల మండలంలోని చెన్నాపురం,పూసుగుప్ప సరిహద్దు గ్రామాల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు మొబైల్ హాస్పటల్ లను, దుమ్ముగూడెంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను,పూసగుప్ప నుండి చత్తీస్గడ్ సరిహద్దు వరకు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డును సుమారుగా మూడు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత యువతకు ఉపయోగపడే విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పోలీస్ శాఖ సహకారంతో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వ పునరావాస పాలసీకి ఆకర్షితులై ఈ సంవత్సర కాలంలో సుమారుగా 300 మందికి పైగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు అండగా ఉంటూ వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.అనంతరం జిల్లాలోని ఆదివాసీ కుటుంబాల నుండి ఉద్యోగాలలో మరియు చదువులో ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా సహాపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్,చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది,ఆదీవాసీ నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :