తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మీడియాపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎంతటివారినైనా వదిలిపెట్టవద్దని టీయూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ఆదివారం డిమాండ్ చేశారు. మహా న్యూస్ టీవీ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించడాన్ని నిరసిస్తూ కొత్తగూడెంలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద విలేకరులు నిరసన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ