తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా స్టోర్స్ కి RG2 ఏరియా నుండి బదిలీపై వచ్చిన బీసీ అధికారి వెంకటరమణ DySE(E&M) నీ సింగరేణి బిసి& ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య ఆధ్వర్యం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు అనంతరం శాలువ కప్పి ఘనంగా సన్మానించుకున్నారు,ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మాట్లాడుతూ సింగరేణిలో బిసి & ఓబీసీ ఉద్యోగుల శాతం అధికంగా ఉన్నారు అని అన్నారు,కానీ వారికి ఆర్ఓఆర్ పద్ధతిలో అన్యాయం జరుగుతుంది అని తెలిపారు,మరియు అందరం కలిసికట్టుగా మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి అందరి మద్దతు కావాలని కోరారు,అదేవిధంగా రాష్ట్రంలో జరిగే 42% శాతం బీసీల ఉద్యమం లో కూడా అందరం పాలుపంచుకొని బీసీల ఐక్యతను చాటి 42% సంధించుకోవడంలో సింగరేణి బిసి ఉద్యోగులు కూడా ముందుండి పోరాడాలని కోరారు, ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు,రాజాలపూడి సాంబమూర్తి, కమల్, కూసన నరేందర్,వేముల నరేష్, వినయ్,సుబ్రమణ్యం, పడాల కృష్ణ, అవినాష్, రాజేష్, ఉదయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు,
Admin
తెలుగు వెలుగు టీవీ