తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. దానిలో భాగంగా అనంతారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కివిచేసిన ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ సర్పంచ్ కొరస రమేష్ పూల మొక్కను అందజేశారు.ఎస్ ఐ ఆర్ కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్ ప్రోగ్రాం ని గ్రామపంచాయతీలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సర్పంచ్ మరియు కార్యదర్శిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్, దుద్దుకూరు మధుసూదన్ రావు, దుద్దుకూరి సుమంత్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, మండల నాయకులు మరియు అనంతారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసికల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ