తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బొగ్గు బ్లాకుల ప్రవేటి కారణను అడ్డుకుంటాం సింగరేణి మనుగడ ఉండాలి అంటే కొత్త బొగ్గు బ్లాకులు రావాలి కార్మికవర్గ పోరాటాలకు సిద్ధం -ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు వీ కే సీ ఎం, పీవీకే 5 గనుల్లో పర్యటించి గేట్ మీటింగ్ నిర్వహించారు అనంతరం సమస్యల పరిష్కారం కొరకు ఏరియా జి ఎం షాలెం రాజు తో సమావేశం. గురువారం ఉదయం ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఏరియాలోని వీ కే సీ ఎం, పీవీకే 5 గనుల్లో విస్తృతంగా పర్యటించి అనంతరం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ను కార్మికులు, అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మిక సమస్యల పట్ల మడమ తిప్పకుండా పోరాడుతామని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి లో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. సింగరేణి మనుగడ కాపాడాలి అంటే కొత్త బొగ్గు బ్లాకులు రావాలి అని అన్నారు,అదేవిధంగా సొంత ఇంటి పథకం అమలు చేయాలని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశం లో ఒప్పుకున్న డిమాండ్ లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ఏఐటీయూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని నేడు ప్రైవేటీకరణ వల్ల ఆ హక్కులు ఒక్కక్కోటిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని సింగరేణిలో ప్రైవేటీకరణ అయితే పెర్మనెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏఐటీయూసీ నాయకులు శేషగిరి రావు, విఠల్ రావు, రాజ్ బహద్దూర్ గౌర్, యూనియన్ కొమురయ్య లు దశాబ్దాల కిందటే చేసిన పోరాటాల ఫలితంగా దీపావళి బోనస్, లాభాల వాటా, పెన్షన్ స్కీమ్ లు సాధించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ నిలుపుదల సరైనదికాదని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ విధానాల పట్ల ఆకర్షితులైన పలువురు కార్మికులు ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో యూనియన్ లో చేరారు. అనంతరం నూతన కొత్తగూడెం ఏరియా జి ఎం కార్యాలయాన్ని సందర్శించారు, ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న వీ కే ఓ సి, కార్మికుల అంతర్గత బదిలీలు ఏరియాలోని పలు కార్మిక సమస్యలను పరిష్కరించాలి అని కోరారు,అనంతరం ఎఐటియుసి చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులు అయిన పి వి కే- 5 యువ కార్మికులు ఏం ఎల్ ఏ సమక్షం లో యూనియన్ లో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్,ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీ వీరాస్వామి, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్ ,ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శిలు హుమాయూన్,మధుకృష్ణ,కమల్,ఏం ఆర్ కే ప్రసాద్,సురేందర్, సీనియర్ నాయకులు వాసిరెడ్డి మురళి,బండారి మల్లయ్య,మండల రాజేశ్వరరావు, కుర్రు రమేష్,బనోత్ రమేష్,సాయిపవన్,బండివెంకటరమణ, కుమారకృష్ణ,క్రాంతి, కుమార్,మహిళా కార్మికులు,మరియు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ