తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి మండలంలో గురువారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన తాచుపామును స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ చాకచక్యంగా పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద తాచుపాము ఇంట్లోకి వచ్చి స్కూటీలో దూరింది. దీన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే సంతోష్కు సమాచారం అందించారు. సంతోష్ ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ