Tuesday, 28 July 2026 12:43:01 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్

Date : 30 June 2025 05:52 PM Views : 645

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి ఈ రోజు పదవీ విరమణ పొందిన ఒక ఎస్సై, ఒక ఏఎస్సై మరియు ఒక హెడ్ కానిస్టేబుల్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపిఎస్, ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు. 41 సంవత్సరాలు పోలీసు శాఖలో పనిచేసి ప్రస్తుతం ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్సై మొహమ్మద్ షఫీ ని,36 సంవత్సరాలు తమ సేవలను అందించి భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఏఎస్సై సత్యనారాయణ ని మరియు అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ చిన్న వెంకటేశ్వర్లు ఈ రోజు పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ పొందిన ఈ ముగ్గురు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ శాలువాలతో మరియు పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీ తో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.ఎంతో కాలంగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఏవో మంజ్యా నాయక్ మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :