తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 11 (తెలుగు వెలుగు ) : శ్రీ శ్రీ N&R ఫామ్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తగూడెం క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్థానిక ప్రకాశం స్టేడియంలో ఈనెల నాలుగో తేదీన నుండి టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం .16 జట్లు పాల్గొన్నాయి ఈరోజు జరిగే మొదటి సెమీఫైనల్ లో సింగరేణి బ్లాక్ డైమండ్స్ వర్సెస్ న్యూ స్టార్స్ రుద్రంపూర్ వారి మధ్య జరిగే మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించిన టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ కార్యదర్శి కాపుకృష్ణ. బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించిన కొత్తగూడెం మున్సిపాలిటీ తాజా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. వారు మాట్లాడుతు క్రికెట్ ఆడటం వల్ల ఆహ్లాదము ఆరోగ్యం స్నేహం పెంపొందుతాయిని గెలుపోటములు సహజమని అందరం ఐకమత్యంతో మెలగాలని అన్నారు. నిర్వాహనాలో పాల్గొన్నవారు వెంకట భాస్కర్, మహేష్,అభిషేక్, విశ్వనాథ్,తేజ్,దీపు, యశ్వంత్, ఆసిఫ్, చరణ్,సురేష్, రఫీ, రమేష్,విజయ్, నిశాంత్, సుధీర్, షణ్ముఖ, నాగరాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ