Tuesday, 28 July 2026 10:18:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కోసం తొలి ఉద్యమం ఎఐటియుసిదే – మిర్యాల రంగయ్య.

Date : 09 July 2026 06:25 PM Views : 352

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని 2013లోనే ఎఐటియుసి ఉద్యమాన్ని ప్రారంభించిందని, అనంతరం 2017 మే 12 నుంచి 18 వరకు "సింగరేణి జాతా" పేరుతో తాడిచర్ల–2 ప్రాజెక్టును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి మాత్రమేనని అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య తెలిపారు.కార్పొరేట్ ఏరియా మెయిన్ వర్క్‌షాప్‌లో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణి వ్యాప్తంగా గనులు, వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలన్నింటినీ తక్షణమే భర్తీ చేయాలని కోరారు.రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ, లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం "బయ బాట" పేరుతో కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం కోసం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు సానుభూతి కోసం మాట్లాడడం సమంజసం కాదన్నారు. కార్మికులు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, పిట్ కార్యదర్శి సుధీర్, నాయకులు వేమన చారి, దినేష్, సత్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :