తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న 319 కేజీల గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. కోటీ విలువ చేసే గంజాయి వాహనాలను, పది మంది నిందితులను, రెండు కార్లను, మూడు బైకులను, తొమ్మిది సెల్ ఫోన్లను , పది మంది నిందితులను పట్టుకున్నామని తెలిపారు.
కుటుంబంపై గంజాయి నేరాల మరకలు. నిన్న మొన్నటి వరకు తండ్రి సదాయ్య గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతూ జైలుపాలైతే.. నేడు భార్య అపర్ణ కుమారుడు నేరళ్ల అఖిల్ గంజాయి అక్రమ రవాణ చేస్తు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.. వీరికి మూడు రాష్ట్రాల్లో ఎన్ని కేసులు పెట్టినా.. గంజాయి అక్రమ రవాణ మార్గంలో ప్రయాణం చేస్తు నేరాలకు పాల్పడుతూ దర్జాగా తిరుగుతున్న మునవర్ అలీని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ