తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహుజన సంఘాల నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా 7 -8-25 గురువారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం పాత బస్ డిపో దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడును ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను కొత్తగూడెం సూర్య ప్యాలెస్ దగ్గర ఉన్న బీసీ సంఘం ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది బహుజన సంఘ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గా ప్రజా ప్రతినిధులు మేధావులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిసి నాయకులు అంకినీడు ప్రసాద్, కాసోజు రామాచారి,కౌడగాని శ్రీనివాస్, శ్రీపాద సత్యనారాయణ, మీనాక్షి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ