Tuesday, 28 July 2026 12:40:16 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బాల్య వివాహాలు లేని భద్రాద్రి జిల్లాగా తీర్చిదిద్దుకుందాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్.

Date : 27 November 2025 07:14 PM Views : 187

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని న్యాయ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ రోజున జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్ )సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల- పాల్వంచ నందు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన అనేది ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్న అంశమని కావున ప్రజలు యువత కౌమార బాలబాలికలు అధికారులు ఇలా అందరి సమన్వయంతోటి సమిష్టి కృషితోటి ప్రయత్నం చేస్తే 2030 లోపే బాల్యవివాహాలను మనం భద్రాద్రి జిల్లాలో సమూలంగా నిర్మూలించవచ్చని పునరుద్ఘాటించారు. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 గురించి, దాంట్లో ఉన్న కఠినధరమైన సెక్షన్ ల గురించి వివరించడం జరిగింది. ఎవరైనా ఈ చట్టాన్ని అధిగమించి బాల్యవివాహాలు చేసినట్లయితే జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని భేటీ పడావో బేటి బచావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లల యొక్క విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాల పట్ల నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు .బాల్య వివాహాలు ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బాలల సమస్యల పరిష్కారానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసి తెలపాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారం అని అనదిగా కొనసాగుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలలకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు . డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ తుకారం రాథోడ్ చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల బాలికలకు శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలు వస్తాయని సరైన పరిపక్వత లేక పుట్టే పిల్లలు కూడా అనేక రకాల లోపాలతో పుట్టడం వల్ల జీవితాంతం ఆ మనోవేదన అనుభవించాల్సి వస్తుందని కొన్ని సందర్భాలలో మాత శిశు మరణాలు కూడా జరుగుతాయని ఈ నష్టాల వలన స్త్రీ పురుష నిష్పత్తి కూడా గణనీయంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలు కౌమార దశలో వచ్చి మార్పుల పట్ల ఆందోళన పడకుండా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో నివృత్తి చేసుకోవాలని రక్తహీనత రాకుండా పౌష్టికాహారం తీసుకుంటూ చక్కని ఆరోగ్యంతో చదివి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తేవాలని తెలిపారు షీ టీం ఎస్సై రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే బాల బాలికలకు మత్తు పదార్థాలు సామాజిక మాధ్యమాలు చరవాణి వినియోగం పట్ల ప్రతి వారాంతంలో విషయాన్ని నిపుణులచే కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిని సరైన మార్గంలో ఉండేలా చూస్తున్నామని తెలిపారు పిల్లలు ఎక్కువగా లవ్ అండ్ అట్రాక్షన్ కి గురవుతున్నారని చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. యువత భవిష్యత్తు పట్ల సరైన అవగాహనతోటి చదువుకోవాలని చెడు వ్యసనాలకు బానిసైతే జీవితం దుర్భరం అవుతుందని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పాల్వంచ ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ చిన్న వయసులో బాల్యవివాహాలను చేయడం వలన బాలికలకు వచ్చే అనారోగ్య సమస్యలు మానసిక శారీరక ఇబ్బందులు మాతా శిశు మరణాలు రక్తహీనత సుఖ వ్యాధులు సంక్రమణం తదితర అంశాలపై వివరిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి బాలికలు తీసుకోవలసినటువంటి తగు జాగ్రత్తలపై సూచనలు చేశారు.ఎయిడ్ సంస్థ డైరెక్టర్ హరి ప్రసాద్ రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా జిల్లాలో గత మూడేళ్లుగా బాల్యవివాహాల నిర్మూలన బాలలపై లైంగిక దాడి బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాల, బాల్యవివాహాలు పై నిరంతరం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు పిల్లలకు అందరికీ అవగాహన కల్పిస్తూ 2030 లోపే బాల్యవివాహ రహిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు అందుకు సహకరిస్తున్న జిల్లా స్థాయి అధికారులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో విజేతలైన వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు బహుమతుల ప్రధానం మెమొంటోలు అతిధులు అందరి చేతులమీదుగా అందించడం జరిగింది .అనంతరం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది .ఈ కార్యక్రమం నందు ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్, డైరెక్టర్ పోపూరి హరి ప్రసాద్ రావు, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న , పంచాయతీ సెక్రటరీ వంశీకృష్ణ ,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై లక్ష్మణ్, ఏఎస్ఐ నాగయ్య, 1098 కోఆర్డినేటర్ సందీప్ మరియు యూనిట్, ఉమెన్ హబ్ బాధ్యులు రూప , డీసీపీయూ యూనిట్, ఎయిడ్ సంస్థ సోషల్ మొబలైజర్స్ మోహన్, మాన్సింగ్, జ్యోతి, మౌనిక విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :