తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి, ఆయుధాలను పాల్వంచలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా డీసీఎం వ్యాన్, కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాలు, కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ