తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : *Press Note* 01/09/2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి. సెప్టెంబర్1( తెలుగు వెలుగు) మండలం మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన మైలారం గ్రామపంచాయతీలో *కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి- కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దాదాపు14 గ్రామాల 150 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు అత్యధిక వర్షాలు ఉండటం వలన కొల్లి ఫౌండేషన్ సంస్థ వారు ఆటోలను ఏర్పాటు చేసి రోగులను క్యాంపు దగ్గరికి తీసుకువచ్చారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు నిర్వహించినందుకు డాక్టర్స్ కి కొల్లి ఫౌండేషన్ తరపున చైర్మన్ కల్పనా చౌదరి* గారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లి ఫౌండేషన్ జిల్లా బాధ్యులు రూప్లా నాయక్, గ్రామ పెద్దలు లక్ష్మీపతి, వాలంటీర్స్ జలీల్ పాష, గోపాల్, బొబ్బెల రమేష్, లాలు, రాంబాబు, రమేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ