తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది.1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమే అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింది 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు,మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తాం సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను ఇతర కమిటీలను వేసుకుంటాం.ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయి ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలలపాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది.ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతాం అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ