Sunday, 26 July 2026 11:33:21 PM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు

Date : 23 July 2026 05:13 PM Views : 792

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు భద్రతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 08.00 గంటల నుండి 10.00 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ప్రతిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు,డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను కనుగొనడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టడం,పాత నేరస్తులను కనిపెట్టే విధంగా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా ప్రతి ఒక్కరి వేలిముద్రలను తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, ముఖ్య రహదారులు, గ్రామాల్లో ఈ నాకాబందీ నిర్వహించబడిందన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 3714 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 2384 ద్విచక్ర వాహనాలు, 987 నాలుగు చక్రాల వాహనాలు, 434 లారీలు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 510 మంది, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన లేదా నంబర్ ప్లేట్ లేని 308 వాహనాలు, హెల్మెట్ ధరించని 524 మంది, సీటు బెల్ట్ ధరించని 106 మంది, మైనర్లు నడిపిన 14 వాహనాలు, అక్రమంగా సైలెన్సర్ మార్పులు చేసిన 4 వాహనాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో 07 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 15 అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా, తనిఖీల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనాని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలపై 764 స్పాట్ చల్లనలను విధించగా, 1567 వాహనాల నుండి జరిమానా వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక నాకాబందీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :