తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు 24 వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రం లో పోషణ మాః లో భాగంగా వార్డ్ కౌన్సిలర్ సత్యభామ మరియు cdpo విజయకుమారి అన్నప్రాశన కార్యక్రమం చేసి వార్డ్ కౌన్సిలర్ సత్యభామ భామ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పిల్లలు పౌష్టికాహారం తో పాటు ఆకు కూరలు తరుచు వినియోగించాలని సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది మరియు cdpo విజయ కుమారి మేడం థౌసండ్ డేస్ ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించారు 270 రోజులు గర్భిణీ దశ అని మిగతా 365 రోజులు 365 రోజులు కలిపి మొత్తం రెండు సంవత్సరాలు పిల్లలకు నిండేదాకా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని తల్లులకు వివరించడం జరిగింది. సెక్టార్ సూపర్వైజర్ శారద టీచర్స్ అందరికి ఈరోజు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఈ ప్రోగ్రాం టీచర్స్ తోటి ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ సత్యభామ మరియు సిడిపిఓ మరియు టీచర్స్ జుబేదా, సుజాత, రాజమణి, గౌసియా ,హెల్పర్స్ త్రివేణి, మల్లేశ్వరి, సుజాత, ఆశా వర్కర్ గంగ మరియు తల్లులు పిల్లలు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ