Tuesday, 28 July 2026 05:05:22 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలి : జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్

Date : 17 June 2026 03:49 PM Views : 88

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన జిల్లా కుష్ఠు నిర్మూలన కార్యక్రమాల పై డిపిఎంఓలు (లెప్రసీ)మరియు హెల్త్ ఎడ్యుకేటర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కుష్ఠు వ్యాధి అనుమానితులను త్వరితగతిన గుర్తించి పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన వారికి వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ (MDT) చికిత్స ప్రారంభించి పూర్తిస్థాయిలో పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఆరోగ్య కేంద్ర పరిధిలో యాక్టివ్ కేస్ సెర్చ్, కాంటాక్ట్ సర్వేలు, ఫాలోఅప్ పర్యవేక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు. కుష్ఠు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని హెల్త్ ఎడ్యుకేటర్లకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చికిత్స, వైకల్య నివారణ చర్యలు, స్వీయ సంరక్షణ (Self Care) పద్ధతులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, గ్రామ సభలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషణ కమిటీ సమావేశాల ద్వారా ఆరోగ్య విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాకుండా ఐఈసీ (IEC) మరియు బీసీసీ (BCC) కార్యక్రమాలను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో రికార్డులు, నివేదికలను సకాలంలో నవీకరించడం, నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో చేతబడి, బాణమతి క్షుద్ర పూజలు మరియు మూఢనమ్మకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని ఆరోగ్య విద్యా బోధకులకు ఆదేశించారు ఈ సమావేశంలో Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్, భద్రూ పీజీయోతెరపిస్ట్ , మోహన్, శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్లు జయలక్ష్మి, రమాదేవి ,బేబీ , వినయ్ కుమార్, బద్రు, ప్రతిభ, మరియు సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :