తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : అనంతారం గ్రామంలో సర్పంచ్ కొర్సా రమేష్ అధ్యక్షతన రైతులకు సంబంధించిన ప్రత్యేక గ్రామసభ, రైతు సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో తాళ్లూరి రవి హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి రైతు తన పొలంలో పంటకుంట తవ్వించి నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట ఏర్పాటు చేసుకోవడం, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంటలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచే అవకాశం ఉంటుందని వివరించారు. నీటి సంరక్షణే భవిష్యత్ వ్యవసాయానికి బలమైన ఆధారమని పేర్కొంటూ, రైతులందరూ ఈ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ రామారావు, ఏఈఓ గోపీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి, గ్రామ దీపిక లక్ష్మీ పాల్గొని రైతులకు నీటి నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.అనంతారం గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని అధికారులతో పలు అంశాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ