తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యుత్ వైర్లకు ఐరన్ రాడ్ తగలడంతో ఓ మహిళా కూలీకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. బాపూజీనగర్లో గల ఓ భవనం పైఅంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ పనికి వెళ్లిన కుంటి నాగులగూడెంకు చెందిన ప్రియ ఐరన్ రాడ్ను పక్కకు వేస్తున్న క్రమంలో రాడ్ బిల్డింగ్ పక్కనే విద్యుత్ వైర్లకు తగలడంతో మంటలు వచ్చి విద్యుత్ షాక్కు గురైంది. వెంటనే తోటి కూలీలు గమనించి ఆస్పత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ