Tuesday, 28 July 2026 10:18:30 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పీఎం ధర్తీ అభాజాన్ జాతీయ ఉత్కర్ష అభియాన్ పథకం గిరిజనులకు అందరికీ అందాలి.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 26 August 2025 07:20 PM Views : 502

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ఏరియాలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా గిరిజనులను చైతన్యపరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఇతర అధికారులతో పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తీసుకోవలసిన కార్యాచరణ పై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారుల చేత పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ కి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియా పరిధిలోని మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాలలోని 134 గ్రామాలలో పిఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకం పగడ్బందీగా అమలు చేయడానికి జిల్లా స్థాయి అధికారులకు హైదరాబాదులోని నిమ్స్ మిక్ (ఎన్ ఐ ఎన్ ఎస్ ఎం ఈ) కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం అందించడం జరిగిందని, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మండల స్థాయిలో బ్లాకుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ అందించి ఆ గ్రామాలలోని ప్రజలకు వారికి కావలసిన మౌలిక వసతుల గురించి అవగాహన కల్పించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

ముఖ్యంగా ఆ గ్రామాలలోని గిరిజనులకు విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్, ఐ సి డి ఎస్, ఫారెస్ట్, జల్ జీవన్ మిషన్, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా గ్రామాలలో చేపట్టవలసిన మౌలిక వసతులపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ప్రజలందరికీ ఆ శాఖల ద్వారా వారు లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. మండలం లెవెల్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరిగి గిరిజనులకు ఈ పథకాల గురించి అవగాహన కల్పించి ఆ గ్రామంలోని పెద్దలను గిరిజనులను ఒకచోట చేర్చి గ్రామసభలో ఆ గిరిజనులకు కావలసిన మౌలిక వసతులు ముఖ్యంగా విద్యా వైద్యం, మంచినీటి సౌకర్యం, కరెంటు, గ్రామంలోని రోడ్లు, అటవీ శాఖ సంబంధించిన పోడు పట్టాలు, గిరిజన సంక్షేమ శాఖ, రూరల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కావలసిన సంక్షేమ పథకాలు,గిరిజన రైతులకు జల్ జీవన్ మిషన్ ద్వారా కావలసిన సదుపాయాలు ఇతర పథకాల గురించి వారికి అవగాహన కలిగించాలని అన్నారు. ప్రతి శాఖల అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ శాతం గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేలా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యాచందన, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, డీఈవో నాగలక్ష్మి, ఏవో సున్నం రాంబాబు, ఐ సి డి ఎస్ పిడి స్వర్ణలత లేనినా, ఆర్డబ్ల్యూఎస్ డీఈ హరిలాల్ మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :