తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడులో విషాదం చోటుచేసుకుంది. 3 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలింత గురువారం భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాకకు చెందిన అంజలముడి సింధు(25) 3 రోజుల క్రితం ప్రసవించింది. బుధవారం రాత్రి ఆమె నోటిలోంచి నురగ రావడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే, తెల్లవారుజామున చనిపోయినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ