Tuesday, 28 July 2026 10:04:29 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మైనార్టీ గురుకులాల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Date : 16 January 2026 05:58 PM Views : 245

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకులాల అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ IDOC క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను మైనార్టీ గురుకుల పాఠశాల ఐదవ తరగతి మరియు కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేర్పించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో బాలికలకు, బాలురకు, బూర్గంపాడు బాలికలకు, భద్రాచలం బాలురకు, అశ్వారావుపేట బాలికలకు, ఇల్లందు బాలికలకు విడివిడిగా ఐదవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ముస్లిం మైనారిటీ పిల్లలను తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైనారిటీల విద్యావకాశాల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిషన్లు ఆన్‌లైన్ ప్రారంభం కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అభివృద్ధి అధికారి కే. సంజీవరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్.ఎల్.సి ఎం.జే. అరుణ కుమారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా విజిలెన్స్ అధికారులు కే. సీతారాములు, ఎం.ఏ. రవూఫ్, జిల్లాలోని మైనారిటీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మైనారిటీ గురుకులాల నాణ్యమైన ఉచిత విద్యావకాశాలపై అవగాహన కల్పించుటకు సీతారాములు అడ్మిషన్ల ప్రచార సాధనంగా రచించిన ఆడియో, వీడియో పాటలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కే. సంజీవరావు కార్యాలయంలో ప్రారంభించారు. గమనిక: తమ పిల్లలను చేర్పించడానికి పూర్తి వివరాల కోసం సంబంధిత పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించగలరు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :