Tuesday, 28 July 2026 02:25:03 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 04 November 2024 04:52 PM Views : 893

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు..... సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.. . కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న వికలాంగుడైన ఆగుళ్ళ మల్లేశం లోగడ వికలాంగుల కోటా కింద ప్రభుత్వం వారు టెలిఫోన్ బూత్ మంజూరు చేశారని, రాను రాను సెల్ ఫోన్ వాడకం పెరగడంతో టెలిఫోన్ బూత్ నడవక పూర్తిగా మూసివేయడం జరిగిందని, అదే ప్రదేశంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని, రైతు బజార్ నూతన నిర్మాణంలో భాగంగా నా యొక్క డబ్బాను పూర్తిగా తొలగించడం వల్ల రోడ్డును పడ్డానని, కావున దయ తలచి నూతనంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయంలో ఒక గదిని కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు. . పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గట్టాయిగూడెం ఏడవ వార్డు లో నివాసం ఉంటున్న కాల్వ సూర్యకాంతమ్మ D/o పట్టాభిక్షం సర్వేనెంబర్ 712/అ /నాలో 12 ఎకరాల 26 కుంటల సొంత పొలం ఉన్నదని, ఆ పొలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు శాంక్షన్ అయినదని, సొంత స్థలంలో గవర్నమెంట్ రోడ్డు వేయడం పై తగు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు. . ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలం ఊటుకూరు గ్రామం లో నివసిస్తున్న వడ్లకొండ బిక్షం s/o రామయ్య తనకు మూడు ఎకరాల పోడు భూమి ఉన్నదని దానిని గత 56 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తన పెద్ద కుమారుడు భార్య చనిపోవడం వల్ల గత ఎనిమిది నెలల నుండి సాగు చేయడం లేదని, దానిని అదునుగా చేసుకొని ఫారెస్ట్ అధికారులు తమ భూమినిస్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. . బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాముల సక్కుబాయి w/o వీరస్వామి తను కూలీనాలీ చేసుకుని సారపాక సుందరయ్య నగర్ కాలనీలో 3.48 సెంట్లు ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం కింద తమను చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎండార్స్ చేశారు. . జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారు విధులకు హాజరు కాకపోవడం వలన గ్రామపంచాయతీలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్ వద్ద దుర్వాసన రావడంతో విద్యార్థులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని భారతీయ గౌడ బంజారా పోరాట సమితి వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి నివేదిక సమర్పించాలని జూలూరుపాడు ఎంపీడీవో నీ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :