Wednesday, 29 July 2026 05:50:49 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు.

Date : 27 July 2026 05:07 PM Views : 339

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు ఈ నెల 31న పదవీవిరమణ పొందనున్న సందర్భంగా సోమవారం ఉదయం ఆర్‌సీహెచ్‌పీ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని జీఎం షాలెంరాజుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియా అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలులో షాలెంరాజు అందించిన సేవలు విశేషమని కొనియాడారు.కార్మికుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, యాజమాన్యం–కార్మికుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పరస్పర సహకారంతో పనిచేసే వాతావరణాన్ని కల్పించడం ద్వారా కొత్తగూడెం ఏరియా అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.పదవీవిరమణ అనంతరం కూడా షాలెంరాజు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, ఆయన సేవలు సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఎస్) ఆర్‌సీహెచ్‌పీ హెచ్‌వోడి జె. లింగ, ఈఈ యశస్వి, ఎస్‌వో టు జీఎం గోవిందరాజు, ఏరియా ఇంజనీర్ రామకృష్ణ, ఆఫీస్ పీఓఏ శ్రీమతి పి. వీరభద్రమ్మ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, అనిల్, యోగేంద్రనాథ్, అనూష, ఎఐటీయూసీ సహాయ కార్యదర్శి జె. గట్టయ్య, నాయకులు ఎం. సురేందర్, యు. శివదర్శన్, ఎస్. నాగేశ్వరరావు, ఆర్. మురళి, జి. రాంబాబు, టి. రమేష్, ఐఎన్‌టీయూసీ నాయకులు కే. కుమారస్వామి, ఎస్. సాంబశివరావు, సమ్మయ్య, బీఎంఎస్ నాయకుడు రవి, హెచ్‌ఎంఎస్ నాయకుడు పూర్ణ, అలాగే ఆర్‌సీహెచ్‌పీ, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :