Tuesday, 28 July 2026 04:22:06 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజావాణిలో ప్రజా వినతులకు ప్రాధాన్యం - తక్షణ పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు

Date : 20 April 2026 05:54 PM Views : 112

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుండి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి వినతిపత్రాన్ని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫిర్యాదులోని మూల సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వినతులను పూర్తి వివరాలతో పాటు అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి ఫిర్యాదుకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు: భద్రాచలంలో నివాసముంటున్న జనగాం సుజల అనే ఒంటరి మహిళ తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారని, తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో తన కుమారుడు ప్రవీణ్ ప్రణీత్ భూషణ్ అర్హత సాధించలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలను చదివించే పరిస్థితి లేదని తెలుపుతూ,తన కుమారుడికి జిల్లాలోని ఏదైనా గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం ట్రైబల్ వెల్ఫేర్ ఆర్‌సీఓకు పంపించారు. చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొంగూరి పల్లవి తాను ఇంటర్మీడియట్ వరకు చదివి, ఎంఫిహెచ్‌డబ్ల్యూ పూర్తి చేసి, ఏఎన్‌ఎం అప్రెంటిస్ కూడా పూర్తిచేశానని తెలిపారు . తనకు ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఏఎన్‌ఎం ఉద్యోగం కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపించారు. చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న కొమరం భద్రయ్య (తండ్రి: వీరస్వామి) తమకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ హక్కు పత్రంతో 4.14 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు. అయితే హక్కు పత్రంలో తన ఫోటో స్థానంలో వేరే వ్యక్తి ఫోటో నమోదైందని, సమస్యను పరిష్కరించి సరిచేయాలని కోరారు. ఈ దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి పంపించారు. పాల్వంచకు చెందిన మంగళగిరి నాగమ్మ (తండ్రి: బుచ్చమ్మ) తమకు సర్వే నెంబర్ 817/36లో భూమి ఉన్నదని, అయితే భూభారతి ఆన్‌లైన్‌లో అది నిషేధిత భూమిగా చూపబడుతోందని తెలిపారు. సమస్యను పరిష్కరించి నిషేధిత భూముల జాబితా నుండి తొలగించాలని కోరారు. ఈ దరఖాస్తును కలెక్టర్ ధరణి అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ శివారులో నివాసముంటున్న గుగులోత్ రాందాస్ (తండ్రి: సోమ్లా) తమకు ఉన్న పట్టా భూమిలో చేపల చెరువు నిర్మాణం కోసం మత్స్యశాఖ పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారికి పంపించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :