తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధి తిరుమలకుంట నివాసి లింగాల జయలక్ష్మి తన ఫిర్యాదులో తన భర్త ఆర్.ఎం.పీ. డాక్టర్‌గా లింగాల చక్రధరరావు పని చేస్తున్నాడని, 2022 డిసెంబర్ 08న దురదపాడు (గ్రా) నుండి ఫోన్ వచ్చినదని, పేషెంట్ వైద్యం చేయడానికి వెళుతున్నానని తనకు వరుసకు కోడలైన దాసరి రమణకు చెప్పి బయటకు వెళ్లాడని తాను సాయంత్రం ఇంటికి రాగా చెప్పినది. ఆ రాత్రికి నేను ఫోన్ చేయగా నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది మీరు తిని పడుకోండి అని చెప్పారని, ఆ తర్వాత కూడా రెండుసార్లు ఫోన్ చేస్తే తను ఎత్తలేదని, ఇంటికి కూడా రాలేదని. 2022 డిసెంబర్ 9న రెండు సార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. పక్కింటి పరికల చేను రామా నా భర్తకు కాల్ చేయగా ఎవరో లిఫ్ట్ చేసి, మందులు కొనడానికి భద్రాచలం వెళ్ళాడని చెప్పారు. నేను భయం వేసి నా కూతురు బండి ప్రభావతికి ఫోన్ చేయగా, నా వద్దకు వచ్చినది. వినాయకపురం లోని గుగ్లోత్ వెంకటేశ్వరరావు గారి జీడి మామిడి తోట ముందున్న పొలానికి వెళ్ళే దారిలో మృతదేహం ఉందని వార్త వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో నా కుమారుడు విజయబాలు హైదరాబాద్ నుండి వాట్సాప్ ద్వారా నా కూతురికి చెప్పడంతో, నా కూతురు నాకు చెప్పకుండా ఆటోలో 11 గంటలకు మృతదేహం వద్దకు తీసుకెళ్లగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుడి భుజం నుండి పదునైన ఆయుధంతో నరికి చంపిన గుర్తులు ఉన్నాయని, వారిపై తగిన చర్య తీసుకొమ్మని అప్పటి అశ్వారావుపేట సబ్‌ఇన్స్పెక్టర్ బి. రాజేష్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్, బి. బాలకృష్ణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు దర్యాప్తు అనంతరం కోర్టులో అశ్వారావుపేట మండలం తుమ్మలకుంట నివాసి షేక్ నసీర్ @ నజీర్ @ థంగ్లి అట్టి హత్య చేశాడని, అప్పటి ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో 22 మంది సాక్షుల విచారణ అనంతరం ఇరు పక్షాల వాద, ప్రతి వాదనలు విన్న తదుపరి షేక్ నజీర్‌పై హత్యా నేరము రుజువు కాగా జీవిత ఖైదు, రూ.1000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. అశ్వారావుపేట సబ్‌ఇన్స్పెక్టర్ వై. రాజు, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎన్. వీరబాబు, (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పిసి బి. నాగేశ్వరరావు లు సహకరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ