Tuesday, 28 July 2026 01:23:58 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చిట్టి రామవరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా 'ప్రజా పాలన ప్రణాళిక' మహిళా వారోత్సవాలు

Date : 25 May 2026 05:50 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గర్భిణులతో వంటల కార్యక్రమం, తల్లులతో ప్రతిజ్ఞ: పోషకాలపై అవగాహన కల్పించిన సూపర్‌వైజర్ పార్వతి​ రామవరం సెక్టార్ పరిధిలోని చిట్టి రామవరం అంగన్‌వాడీ కేంద్రంలో 99వ రోజుల "ప్రజా పాలన ప్రణాళిక" మహిళా వారోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామవరం సెక్టార్ సూపర్‌వైజర్ శ్రీమతి పార్వతి మేడం గారు హాజరయ్యారు. ​మహిళా వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలతో కలిసి ప్రత్యేకంగా వంటల కార్యక్రమాన్ని (కుకింగ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. గర్భధారణ సమయంలో ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ప్రత్యక్షంగా వివరించడానికే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ పార్వతి గారు మాట్లాడుతూ... గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దైనందిన జీవితంలో స్థానికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు మరియు పోషకాలతో కూడిన ఆహారాన్ని భాగం చేసుకోవాలని ఆమె తల్లులకు అవగాహన కల్పించారు. ​అనంతరం కేంద్రానికి వచ్చిన తల్లులందరితో పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మరియు సరైన పోషణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రామవరం సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :