తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ దళారీలు రూ. లక్షా యాభై వేలు దోచుకున్న ఘటన కలకలం రేపింది. బాధితుడికి ఉద్యోగం రాకపోగా, మరోసారి రూ. 30, 000 డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించి తీవ్ర మనస్థాపానికి గురైన పినపాక మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన సప్రిట్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హుటాహుటిన కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ