తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన జర్నలిస్టులకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జారీ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని, ముఖ్యంగా జి.ఓ. నెం. 252లో పేర్కొన్న నియమ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.అక్రిడిటేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా, నిజాయితీతో పరిశీలన చేపట్టి అర్హులైన వారికి మాత్రమే కార్డులు జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధుల సేవలను గౌరవిస్తూ, వారికి అవసరమైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ