Tuesday, 28 July 2026 05:10:36 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి : కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ

Date : 16 July 2025 04:52 PM Views : 750

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : న్యాయవాదుల సంక్షేమానికి కొత్త కోర్టులు,హెల్త్ కార్డులు, గృహ స్థలాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు కృషి చేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ కోరారు.బుధవారం న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్ నందు కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతుకురీ ధర్మారావు,నాగ సీతారాములు,రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యులు జే.బీ.శౌరి, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,ఉమ్మడి జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎస్సీ-ఎస్టీ కోర్టు,ఫ్యామిలీ కోర్టు,లేబర్ కోర్టు వంటి నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల, గవర్నమెంట్ ప్లీడర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,కొత్తగా నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,2019 తర్వాత ఎన్రోల్ అయిన ప్రతీ న్యాయవాదికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డ్ ల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.అలాగే అర్హులైన న్యాయవాదులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని,న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు వస్తుందని,నూతన న్యాయస్థానాల ఏర్పాటుతో పాటు వాటికి సంబంధించిన న్యాయసౌధాల నిర్మాణం,న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తామని సన్మాన గ్రహీతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భాగం మాధవ్ రావు,రేపాక వెంకటరత్నం,పలివెల సాంబశివరావు,వి.వి.సుధాకర్ రావు,వై.వి.రామారావు,రావి విజయ్ కుమార్,ఊట్ల రాజేశ్వరరావు,ఎర్రపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :