తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని పత్తి రైతు సోదరులకు ముఖ్యమైన సమాచారం అందిస్తూ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు, రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం పిలుపు మేరకు రేపు తేదీ 18-11-2025 న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు బంద్‌లో పాల్గొననున్నాయి. అందువల్ల పత్తి రైతులు రేపు తమ పత్తిని సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (CCI) వారికి అమ్ముకొనుట కోసం పత్తిని తీసుకువెళ్లకూడదని ఆయన సూచించారు.రేపు సిసిఐ సీఎండీ తో రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని, ఈ చర్చల అనంతరం పరిస్థితులపై స్పష్టత వచ్చిన తరువాతే పత్తి కొనుగోలు ప్రక్రియపై తదుపరి సూచనలు జారీ చేయబడతాయని నరేందర్ వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ