తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతుంది. ఎగువ నుంచి వరద వచ్చి చేరడంతో కొత్తనీటితో ప్రవాహం సాగుతోంది. సోమవారం ఉదయం 10.3 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం ఉదయం మూడు అడుగులు పెరిగి 13.3 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
Admin
తెలుగు వెలుగు టీవీ