Tuesday, 28 July 2026 04:20:30 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గని ప్రదేశంలో కార్మికులకు వసతులు,సదుపాయాలు కల్పించాలి. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో గుర్తింపు సంఘం చర్చలు.

Date : 29 May 2026 06:14 PM Views : 237

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇంక్లైన్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మైన్స్ కమిటీ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, గని పరిసరాల్లో ఉన్న మౌలిక సదుపాయాల లోపాలు, భద్రతా అంశాలు మరియు కార్మిక సంక్షేమానికి సంబంధించిన విషయాలపై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం (ఎఐటీయూసీ) నాయకులు యాజమాన్యంతో చర్చించారు. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటీయూసీ పిట్ కార్యదర్శి భూక్యా రమేష్ నాయకత్వం వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు తగిన సంక్షేమ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రతా ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడం యాజమాన్య బాధ్యత అని స్పష్టం చేశారు. కార్మికుడు ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తాడని తెలిపారు.గని పరిసరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మైన్స్ కమిటీ సభ్యులు, గని మేనేజర్‌తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. మాన్‌వేకు వచ్చే దారిలో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని గుర్తించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే డ్రైనేజీ మరియు నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు.అదేవిధంగా స్నానాల గదులు, కార్మికులు ఉపయోగించే సాధారణ ప్రదేశాల్లో ప్రతిరోజూ పరిశుభ్రత నిర్వహించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత లోపిస్తే కార్మికుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి కార్మికుడికి అండగా నిలిచి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని ఎఐటీయూసీ నాయకులు తెలిపారు. గనుల్లో పనిచేసే ప్రతి కార్మికుడి సంక్షేమం, భద్రత, ఆరోగ్యం విషయంలో యాజమాన్యం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గని మేనేజర్ శ్యాంప్రసాద్, ఎస్‌ఓ అనిల్ సాగర్, ఎల్‌హెచ్‌డీ మరియు కామన్ సెక్షన్ ఇంచార్జి శ్రవణ్, యాక్టింగ్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేష్, ఎఐటీయూసీ పిట్ కార్యదర్శి భూక్యా రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, సందీప్, సుమన్, సురేందర్ రెడ్డి, దేవుసింగ్, కె. రాంచందర్, శశివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :