తెలుగు వెలుగు టీవీ - వార్తలు / : కొత్తగూడెం: మిషన్ భగీరథ పనులు అంటూ రామవరం మార్కెట్ లోని రోడ్డును రెండు సార్ల తొవ్వి పనులు ఆలస్యం అవుతుంటే రామవరం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫహీమ్ దాదా అన్నారు సిపిఐ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రామవరం మెయిన్ మార్కెట్ అయినటువంటి రోడ్డును గత రెండు మూడు నెలల క్రితం మిషన్ భగీరథ పైప్లైన్ కొరకు జెసిబి లతో తవ్వి మరల ఇప్పుడు తవ్వి పనులు ఆలస్యం అవుతుంటే రామవరం వ్యాపారస్తులు మరియు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు రామవరం ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరగా తిను పనులు పూర్తి చేయాలని కోరారు ప్రజా నాయకులు కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనoనేని సాంబశివరావు గత నెల క్రితం రామవరం వచ్చి రోడ్డును చూసి త్వరగా పనులు పూర్తి చేసి రామవరం వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును నిర్మించాలని అధికారులను కోరారని ఆయన వ్యాపారస్తులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో దబ్బేటి గురుమూర్తి, ఖయ్యూం,మర్రి గోపి, వంశీ, దాసు, రణధీర్, అల్లకొండ గోపి, శ్యామ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ