Tuesday, 28 July 2026 12:31:49 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వందేళ్లైనా ప్రజాదరణ తగ్గని ఏకైక పార్టీ సిపిఐ. జనబలంతో కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 07 January 2026 07:06 PM Views : 232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గౌతంపూర్, రుద్రంపూర్, రామవరం నుంచి బైపాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ. స్వాతంత్రోద్యమం నుంచి పురుడుపోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లైనా ప్రజాదనరాన తగ్గకుండా అజేయంగా నిలిచిందని, ప్రజా ఉద్యమాలతో భారత గడ్డపై మరో వందేళ్లైనా వన్నె తగ్గనివ్వబోమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ శతవసంతాళ ముగింపు సందర్బంగా జనవరి 18న ఖమ్మం నగరంలో జరగనున్న బహిరంగసభ సందర్బంగా చేపట్టిన ప్రచారజాతా బుధవారం చుంచుపల్లి మండలం, గౌతంపూర్ సింగరేణి ప్రాంతానికి చేరుకుంది. ప్రచారజాతా బృందానికి సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. గౌతంపూర్ నుంచి రుద్రంపూర్, రామవరం, కొత్తగూడెం పోస్టాఫీసు మీదుగా చుంచుపల్లి మండలపరిధిలోని విద్యానగర్ వైపాస్ సెంటరుకు చేరుకుంది. ఈ సందర్బంగా ప్రధాన సెంటర్లలో జరిగిన సభల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి, ప్రచారజాతా బృందం నాయకులు ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ వందేళ్లుగా ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాల్లో మడమతిప్పబోమని అదే సిపిఐకి బలమన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాలు సిపిఐ పోరాట ఫలితాలేనన్నారు. జిల్లాలో భూపోరాటాలకు నాంది పలికి పేదలకు గూడు కల్పించామని తెలిపారు. పోడు సాగుచేసుకుంటున్న పేదలపక్షాన పోరాడి భూములపై హక్కు కల్పించామన్నారు. రైతు, యువజన, విద్యార్థి, మహిళా ఉద్యమాలతో ప్రజలకు మరింత చేరువయ్యామన్నారు. నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదని త్వరలో జరగనున్న కొత్తగూడెం కొర్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగిస్తామని స్పష్టం చేశారు. జాతా సందర్బంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, శేషగిరిరావు, బందెల నర్సయ్య, డాక్టర్ జయశంకర్, తెలంగాతల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదనంతరం రామవరం పట్టణంలో భారీ ర్యాలీ అనంతరం సిపిఐ రాష్ట్ర నేత అమరజీవి బరిగెల సాయిలు , ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నేత మహమ్మద్ దాదా స్తూపానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.కార్యక్రమంలో సిపిఐ నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, సారెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మి కుమారి, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, జి.వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, ఫహీమ్, వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జున్ రావు, భూక్యా శ్రీనివాస్, మాతాంగి లింగయ్య, అన్నెం లక్ష్మీనారాయణ,సంధబోయిన శ్రీనివాస్, మర్రి గోపి, మండల రాజు, తూముల శ్రీనివాస్, పేయ్యాల రంగారావు,బరిగెల భూపేష్, గుత్తుల శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, దాట్ల శ్రావణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, సోమయ్య,ఎస్.కె జహీర్, జలీల్, నరేందర్ ,నిమ్మల రాంబాబు, పాటి మోహన్ రావు, వాకపల్లి హరినాథ్, దేవదాసు, సుధనాల రమేష్, కొత్తూరు రవి, సుధాకర్, యూసుఫ్, ధర్మరాజు, సత్యనారాయణ చారి, బండి నర్సింహా, దుర్గ, సర్పంచ్ లు శాంతి శ్రీ, వాడే రాములు, మాజీ సర్పంచ్ గుగులోత్ నగేష్, మాజీ ఉపసర్పంచ్ సింగిరాల రమేష్, అల్లకొండ మోహన్, గోపి తోటకూర శ్రీనివాస్, కూరగాయల శ్రీనివాస్, అజ్మీర బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :