తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 2 తెలుగు వెలుగు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలకేంద్రం లో సీనియర్స్ (ప్రెస్ క్లబ్) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద అధ్యక్షులు కొలిపాక చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదస ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్ ) కమిటీ సభ్యుల తో కలసి మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామని అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దానికి వారధిలా ఉంటామన్నారు. కమిటీ సమిష్టి నిర్ణయాలతో ముందుకెళతామని అన్నారు. ప్రస్తుతం కొలిపాక చంద్రశేఖర్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా( టీజేఎఫ్ ) తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తదుపరి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో. జర్నలిస్టు మిత్రులు. గుండా సత్యనారాయణ, బాపట్ల మురళి, తంబళ్ల పుల్లారావు, సబ్బతి శివ మూర్తి, సంగం నాగరాజు, నల్లగట్ల దిలీప్ కుమార్, బండి సత్యనారాయణ, షేక్ బుడెన్ పాష, ఉసికల రమేష్,అన్నవరపు జస్వంత్ కుమార్, చాపల మడుగు నరసింహారావు, గోగుల వెంకటేశ్వర్లు, కాసిమల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ