Tuesday, 28 July 2026 03:36:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని.

Date : 27 July 2026 08:22 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.ఉద్యమ పోరుకు తలవంచిన ఢిల్లీ పీఠం.ఢిల్లీ కేంద్రంగా సాగిన విద్యార్థుల పోరాట పటిమ అభినందనీయం. నీట్‌ను రద్దు చేసి పరీక్షల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఇవ్వాలి.ఉద్యమ విరమణ హామీలను కేంద్రం తక్షణమే నెరవేర్చాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. దేశంలో కోట్లాది మంది విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థి లోకం సాగించిన వీరోచిత ఉద్యమ పోరుకు ఎట్టకేలకు ఢిల్లీ పీఠం తలవంచక తప్పలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. నీటి పరీక్షా పేపర్ల లీకుతో నష్టపోయి ఆత్మహత చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పిస్తూ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించి కూనంనేని మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు ప్రదర్శించిన అసమాన పోరాట పటిమ ఎంతో అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తును నాశనం చేసే నీట్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యమ విరమణ హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను వ్యాపారీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్యవర్గ సభ్యులు కంచర్ల జములయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, ఎస్కే ఫహిన్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, సపవట్ రవి, ఎండి యూసుఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, బోయిన విజయకుమార్, బండి నరసింహ, దర్గయ్య, గడ్డం సతీష్, రాకేష్, షాహిన్, కైసర్, గోవిందు, జహీర్, పి సుధాకర్, హతిరం, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :