Tuesday, 28 July 2026 04:47:04 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బొజ్జి గుప్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 December 2025 06:27 PM Views : 253

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలోని బొజ్జి గుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించి పాఠశాల నిర్వహణ, బోధన ప్రమాణాలు, విద్యార్థుల నేర్పును సమగ్రంగా పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్ తరగతి గదులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా స్థాయి, హాజరు, పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కిషన్ షెడ్ ఆవరణలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను పరిశీలించి వాటి పరిరక్షణ మరియు సంరక్షణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ చర్య పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిన్నారుల్లో మంచి అలవాట్లను పెంపొందిస్తుందన్నారు. పాఠశాల ప్రాంగణంలోని పచ్చదనం, పర్యావరణ శుభ్రత పట్ల ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధను ఆయన అభినందించారు. అలాగే కలెక్టర్ విద్యార్థుల రీడింగ్ మరియు రైటింగ్ స్కిల్స్‌ను ప్రత్యేకంగా పరీక్షించి, వారు చదివే స్థాయి, అక్షరాల గుర్తింపు, వాక్య నిర్మాణం వంటి అంశాల్లో వారి సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు పఠనంలో మరింత నైపుణ్యం సాధించేలా తరగతి గదుల్లో రోజువారీ రీడింగ్ యాక్టివిటీలను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు రాయడం–చదవడం నైపుణ్యాలతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకునేలా పాఠశాలలో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్రీడలు మరియు ఆటలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అత్యంత కీలకం అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించే భాగంగా వారికి నోట్‌బుక్స్, పెన్నులను అందజేసి, క్రమం తప్పకుండా చదువులో ముందుకు సాగాలని ప్రోత్సాహించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, ప్రతిరోజూ పాఠశాలకు హాజరై పాఠాలు నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బుజ్జి గొప్ప గ్రామంలో గత సంవత్సరం ఏరు ఫెస్టివల్ లో భాగంగా చేపట్టిన విధంగానే గిరిజన సాంప్రదాయాలు ఆదివాసీల ఆవాసాలు, ఆహార అలవాట్లను బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు వసంతరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :